కోమాలో నర్సింగ్ యాదవ్..!

235
narsing yadav

25 ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్ కమెడీయన్‌గా,విలన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నర్సింగ్ యాదవ్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన భార్య వెల్లడించింది.

కోమాలోకి వెళ్లిన నర్సింగ్‌ను యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తున్నారని ఆయన భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. ఇంట్లో పడిపోవడంతో ఆయన తలకు బలమైన గాయమైందని వార్తలు వస్తున్నాయి వాటిలో నిజంలేదని వెల్లడించింది.

కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని…ఆయనకు డయాలసిస్ జరుగుతోందన్నారు. గురువారం ఉదయం డయాలసిస్ జరిగిన తర్వాత అనుకోకుండా అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారని ఆమె వాపోయింది. 48 గంటలు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్లు..ఆయన క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండన్నారు.

ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన క్షణం క్షణంలో నర్సింగ్ పాత్రకు మంచి గుర్తింపువచ్చింది. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. 400కు పైగా సినిమాల్లో నటించారు.