కరోనా ప్యాకేజ్‌..రూ.15 వేల కోట్లు రిలీజ్

85
coronavirus

కరోనా కట్టడిలో భాగంగా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్న కేంద్రం …కరోనా ప్యాకేజ్‌లో భాగంగా రూ. 15 వేల కోట్లు విడుదల చేసింది. దాదాపు 15 రాష్ట్రాలకు అత్యవసర ప్యాకేజ్ కింద నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ. 15 వేల కోట్ల నిధులను మూడు దశల్లో ఖర్చు పెట్టనున్నారు. జనవరి 2020 నుంచి జూన్‌ 2020 వరకు మొదటి దశ, జులై 2020 నుంచి మార్చి 2021 వరకు రెండో దశ, ఏప్రిల్‌ 2021 నుంచి మార్చి 2024 వరకు మూడో దశగా కేంద్రం నిర్ణయించింది.

కరోనాను నియంత్రించేందుకు 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది కేంద్రం. వీటిలో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలున్నాయి.