పాతబస్తీలో ఆపరేషన్‌ చబుత్రా..

34
chabuthra

నగరంలో రాత్రిపూట ఏ కారణం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న యువకులకు కట్టడి చేసేందుకు సౌత్ జోన్ పోలీసులు తీసుకొచ్చిన కార్యక్రమం ఆపరేషన్ చబుత్రా. బుధవారం రాత్రి పాతబస్తీ కాలాపత్తర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా 35 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వాహనాలను ర్యాష్‌గా నడపవద్దంటూ కోరారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలని అడిషనల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి కోరారు.