సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ Vs ఎస్పీ..బిగ్ ఫైట్

31
himachal prdesh

హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారికి, ఎస్పీకీ మధ్య ఫైటింగ్ జరిగింది సీఎం సెక్యూరిటీని చెంపదెబ్బ కొట్టారు ఎస్పీ. తిరిగి ఎస్పీని చెంప మీద కొట్టారు సెక్యూరిటీ అధికారి. హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అధికారుల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. భుంతర్​ విమానాశ్రయం వద్ద.. కులు జిల్లా ఎస్పీ గౌరవ్సింగ్, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సెక్యూరిటీ ఆఫీసర్​ మధ్య వివాదం తీవ్రమైంది.

ఈ క్రమంలో సెక్యూరిటీ అధికారిని చెంపదెబ్బ కొట్టారు కులు ఎస్పీ. దీనిపై ఆగ్రహించిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గౌరవ్​ సింగ్​పై తిరిగి చేయి చేసుకున్నారు. అయితే.. సమీపంలో ఉన్న పోలీసులు అధికారులు వెంటనే పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.