ఆగని పెట్రో బాదుడు..

54
petrol

పెట్రో బాదుడు ఆగడం లేదు. రోజువారి సమీక్షలో భాగంగా మరోసారి పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసలు పెరుగగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.76, డీజిల్‌ రూ.88.30కి చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.60గా ఉండగా డీజిల్ 96.25కి చేరింది. ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.89కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109కి చేరువైంది. చెన్నైలో పెట్రోల్‌ రూ.98.88.. డీజిల్‌ రూ.92.89,కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.97.63, డీజిల్‌ రూ.91.15,విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61,బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.03, డీజిల్‌ రూ.93.61గా ఉంది.