ఇలా అయితే ఎలా చిరు ?

99
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.  ఈ క్రమంలో పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.  అయితే ఇలా ఎన్నాళ్లు..?. ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి – రవితేజ హీరోగా రాబోతున్న సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ అంచనాలకు ఇప్పుడు నీరసం వస్తోంది. వాల్తేరు వీరయ్య  పోస్టర్లు, సాంగ్స్ చూస్తుంటే.. పక్కా రొడ్డకొట్టుడు రొటీన్ ఫార్ములాతో ఈ సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చేసింది. 

మెగాస్టార్ లెక్కల ప్రకారం…ఎలాగూ  హీరోయిన్ ఉంటుంది, గెంతులుంటాయి… ఫైట్లుంటాయి… కామెడీ ఉంటుంది… పైగా సినిమాలో మరో హీరో రవితేజ కూడా ఉన్నాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి  అవి అలరిస్తాయా లేదానేది వేరే విషయం… ఫార్ములా ప్రకారం  వాల్తేరు వీరయ్య సినిమా ఉందా లేదానేదే ముఖ్యం. అలా చూసుకుంటే  వాల్తేరు వీరయ్య అలాగే ఉంది. 
 
కానీ.. మెగాస్టార్ నుంచి ఇలాంటి సినిమానా రావాల్సింది. ఎప్పుడు అవే ఫోజులు, నటనలో అదే మొనాటనీ… ఇలా అయితే ఎలా ?, తనలోని మంచి నటుడిని తనే చిరు దాచేస్తే ఎలా ?,  ప్రయోగాలకు వెళ్లలేని పరిస్థితులు ఉండొచ్చు. ఇంతకుమించి చేయడానికి తనకు ఏ స్కోపూ లేకపోవచ్చు. కానీ మెగాస్టార్ సినిమా అంటే.. ఓ రేంజ్ లో ఉండాలి  అంతే. ఇంతకీ మెగాస్టార్ ఈ సినిమాతో  ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.  ఏది ఏమైనా జనవరి 13న చిరు ఫ్యాన్స్ పండగ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.  

ఇవి కూడా చదవండి..
- Advertisement -