- Advertisement -
ఆన్లైన్ గేముల్లో 11 లక్షలు పోగొట్టుకున్నాడు రిటైర్డ్ ఎస్సై మనవడు. ఆన్లైన్ క్లాసుల కోసం పదకొండేళ్ల తన మనవడికి ఇటీవల ఫోన్ కొనిచ్చారు రిటైర్డ్ ఎస్సై అలీ. ఆన్లైన్ కాసుల మధ్య వచ్చే గేమింగ్ యాడ్లను క్లిక్ చేశాడు బాలుడు. సెల్ ఫోన్ కి అనుసంధానంగా ఉన్న రిటైర్డ్ ఎస్సై అలీ బ్యాంకు ఖాతా నుంచి 11 లక్షలు ఖర్చు చేశాడు బాలుడు.
విషయం తెలియగానే ఖంగుతిన్న బాలుడి కుటుంబ సభ్యులు…సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగపూర్ గేమింగ్ కంపెనీ తో మాట్లాడి బాధితుడు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వెనక్కి తెప్పించారు పోలీసులు. డబ్బులు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు బాధితులు. సైబర్ క్రైం మోసాల వలలో పడకూడదని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు బాధితులు.
- Advertisement -