బిహార్ కాబోయే సీఎం నితీశ్ కుమారే: బీజేపీ

138
modi
- Advertisement -

దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ కంటే ఎక్కువగా బీజేపీ సీట్లు సాధించగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనన్న సందేహం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో బిహార్ కాబోయే సీఎం ఎవరనేదానిపై స్పష్టత ఇచ్చారు బిహార్ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ.

నితీశ్ కుమారే బిహార్ కాబోయే సీఎం అని తెలిపారు మోదీ. ఇందులో ఎలాంటి సందేహం లేద‌ని …తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని, ఇందులో ఎలాంటి గంద‌ర‌గోళం లేద‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో కొంద‌రు ఎక్కువ సీట్లు గెలుస్తారు, మ‌రికొంద‌రు తక్కువ స్థానాల్లో విజ‌యం సాధిస్తారు కానీ తాము సమాన భాగస్వాములమేనని చెప్పారు.

మూడు విడుత‌ల్లో జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 74 స్థానాల్లో,జేడీయూ 43 స్ధానాల్లో గెలుపొందింది. దీంతో ఆరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు నితీశ్‌ కుమార్.

- Advertisement -