మొన్నటి వరకు దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో ఉల్లిపంట నీట మునిగింది.. దీంతో దేశంలో ఉల్లి ధరలు అమాంతంగా కొండెక్కాయి. దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఎగుమతిని ఆపేసి ధరలను నియంత్రించింది ప్రభుత్వం. అయితే తాజాగా మళ్లీ ఉల్లి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన ఉల్లి ధర మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో తిరిగి పెరగడం మొదలెట్టాయి. మరికొన్ని రోజులు ఇలానే వర్షాలు కురిస్తే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఉల్లిని ప్రధానంగా పండించే మహారాష్ట్రతో పాటు కర్నూలులో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బంది. సాధారణంగా ధర పెరిగితే రైతులు లాభపడాలి. కానీ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నా రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగడం లేదు. మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో పెరిగిన ఉల్లిపాయ ధరలు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.