ఎన్టీఆర్…మత్తు వదలరా ఫస్ట్ లుక్

495
ntr
- Advertisement -

హిట్ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేకర్స్ కొత్త నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం మత్తు వదలరా. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన సినిమా ప్రీ లుక్ అందరిని ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు ఎన్టీఆర్.

సమయం ఎలా గడిచిపోతుందో తెలియ‌డం లేదు. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తొలి చిత్రాలతోనే మీరు విజయం సాధించాలి… చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ స్టిల్స్‌ ఉండగా ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో రితేష్ రానా దర్శకుడిగా పరిచయం అవుతుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -