త్రిష పెళ్లంటూ.. మళ్లీ గుసగుసలు

270
Once Againe Trisha marriage Gossips In Kolllywood

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక త్రిష. ఆమెకి ప్రస్తుతం టాలీవుడ్‎లో అవకాశాలు లేవు. ఇక ఆమె దృష్టంతా కోలీవుడ్ సినిమాలపైనే పెట్టింది. అయితే కోలీవుడ్‎లో త్రిషకి సంబంధించిన ఓ వార్త హల్‎చల్ చేస్తుంది. ఈ అందాల బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాలలో ఆమె భారీ స్థాయిలో షాపింగ్ చేసిందని అంటున్నారు. అదేదో సరదా షాపింగ్ లా లేదని.. అందువలన ఖచ్చితంగా అది పెళ్లి షాపింగేనని కోలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు.

మరోవైపు త్రిష గత కొంతకాలంగా ఓ బిజినెస్ మేన్‎తో చనువుగా ఉన్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బిజినెస్ మేన్‎తో పెళ్లి కోసమే.. ఈ అమ్మడు షాపింగ్ చేసిందని అనుకుంటున్నారట. అయితే త్రిష అమ్మ మాత్రం ఈ వార్తలును ఖండిచింది. త్రిష ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తుందని, వాటిని పూర్తి చేసే పనిలో ఉందని తెలిపింది. ఆ మూడు సినిమాలు పూర్తికాగానే.. పెళ్లి సంగతి చెప్పవచ్చని అనుకుంటున్నారు. గతంలో త్రిష పెళ్లి.. పీటల వరకూ వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల తర్వాత అయినా.. ఈ అమ్మడు పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి ఇక.