కోటి రూపాయలతో కుచ్చుటోపీ…దంపతులపై కేసునమోదు

74
- Advertisement -

చిత్తూరుజిల్లా పీలేరు,ప్రకాశంజిల్లా ముండ్ల మూరు గ్రామానికి చెందిన వీర నారాయణ మ్మ,దండపాణి వీరిద్దరూ2010లో వ్యాపార నిమిత్తం పీలేరుకు వచ్చారు.A To Z పేరుతో పీలేరులో బిగ్ బజార్ నడిపేవారు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకొని తమ పేరుమీద బ్యాంకు లో85 లక్షలరూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్ ఉందని అందరిని నమ్మబలికి సుమారుకోటి రూపాయలు అప్పులు చేసి వ్యాపారం చేస్తున్న క్రమంలో అప్పులిచ్చిన వారి ఒత్తిడి చేస్తుండడం తో2019లో పారిపోయారు.

కొంత మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసునమోదు దర్యాప్తు చేపట్టారు.వారు ఎవరికి కన్పించ కుండా షిరిడి వెళ్లి పోయారు తర్వాతకొద్దిరోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉండే క్రమంలో పిలేరులోని వారి షాపు లో వస్తువుల కోసం పీలేరు రావడంతో, సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -