CMKCR:తెలంగాణలో ఎకరం.. ఆంధ్రాలో 100 ఎకరాలకు సమానం

36
- Advertisement -

తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకు స్థాపన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఒక్కటే మాట మనవి చేస్తున్నా మోసపోతే…గోసపడతాం. ఏ ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను దగాకోరులకు అప్పజేప్పవద్దన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దామని అన్నారు.

తెలంగాణ ఏర్పడకూడదని అని మాట్లాడినటువంటి పెద్దలే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నామని చంద్రబాబు నాయుడే చెప్పారు. అంటే లెక్కలు తారుమారైంది.. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమే. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లావారిని సమైక్య శక్తులు ఆగమాగం చేశారు.

తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ధరం ఎంత? ఆ రోజు ఎంత ఉండే? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నది. రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చు. ఇంకా నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది. మనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టి.. ప్రజలను మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి ముందుకెళ్తున్నామని అన్నారు.

Also Read: శంకరమ్మకు సముచిత పదవి!

తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలి. జీవితాలను అర్పించడం కంటే గొప్పత్యాగం మరొకటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ధారబోసి త్యాగాలు చేశారు కాబట్టి.. దశాబ్ది ఉత్సవాల ముగింపులో వారందరినీ తలచుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: CMKCR:జై తెలంగాణ.. జైజై తెలంగాణ

- Advertisement -