ఓనం 2023..కింగ్‌ ఆఫ్ కోత

10
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ సినీ పరిశ్రమలో విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కోత’ 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులలో సందడి చేస్తోంది. అతని తొలి చిత్రం ‘సెకండ్ షో’లో అందరూ ఇష్టపడే గెటప్ లాగానే, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ రగ్డ్ లుక్ ఈ పోస్టర్‌లో అలరిస్తోంది.

జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది. అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ , ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పని చేస్తుండగా.. జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్ కలసి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

కళాతపస్వి…’ఎస్’ లెటర్ సినిమాలు

కళాతపస్వి కి ప్రముఖులు సంతాపం

లెజెండ్ కె.విశ్వనాథ్ మరణానికి.. కారణం అదే!

- Advertisement -