చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 16

229
On This Day - History
- Advertisement -

ఫిబ్రవరి 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 47వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 318 రోజులు (లీపు సంవత్సరములో 319 రోజులు) మిగిలినవి.

*సంఘటనలు*

1915: గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించాడు.
1931: భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని ‘Half naked seditious Fakir’ అని అన్నాడు.
1959 : ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

*జననాలు*

1827: ఫ్రాంసిస్ ప్రాట్, ప్రాట్ & విట్నీ స్థాపకుడు.
1910: నోరి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995)
1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు
1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
1952: రాధారెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డి గార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు
1954: మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1956: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1964: లగడపాటి రాజగోపాల్, పారిశ్రామికవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.

*మరణాలు*

1944: దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870)
1956: మేఘనాధ్ సాహా, భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893)
1961: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
1985: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)

- Advertisement -