జీనియస్‌తో మెగా ఫోన్ పట్టిన దర్శకుడు ఓంకార్. తర్వాత హారర్ కథతో లిమిటెడ్ బడ్జెట్ లో ఓంకార్ తెరకెక్కించిన ‘రాజుగారి గది’ బాక్సాపీస్ ముందు మంచి సక్సెస్‌ని సాధించింది. స్టార్ గ్లామర్ లేక పోయినా కంటెంటుతో హిట్ కొట్టిన ఓంకార్ తర్వాత స్టార్ గ్లామర్‌తో రాజుగారి గది 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా హిట్ సాధించడంతో తాజాగా ఆ హిట్ ప్రాంచైజీని వాడుకుంటూ ‘రాజుగారి గది 3’ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.
ఓ వైపు కథ ఫైనల్ చేస్తూనే మరోవైపు నటీనటులను ఎంచుకునే పనిలో పడ్డారు . బాహుబలి తర్వాత ఎఫ్2 సినిమాతో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నను సంప్రందించాడట ఓంకార్. అయితే ఇందుకు మిల్కీ బ్యూటీ చెప్పిన సమాధానం విని ఆయనకు దిమ్మతిరిగిందట.
రాజుగారి గది 3 కోసం తమ్మూ బేబి కోటిన్నర డిమాండ్ చేయడంతో షాక్ తినడం ఓంకార్ వంతైందట. అసలే లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఓంకార్ హీరోయిన్‌కు కోటిన్నర ఇచ్చే అవకాశం లేకపోవడంతో తమ్ము స్ధానంలో వెరోకరిని తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ టీ టౌన్లో మాత్రం వార్త చక్కర్లు కొడుతోంది.