విజయ్‌తో దేనికైనా రెడీ..!

351
vijay devarakonda jyothi
- Advertisement -

జ్యోతి బోల్డ్ పాత్రల్ని చేయడమే కాదు.. బోల్డ్‌గా మాట్లాడటానికి కూడా ఏమాత్రం సిగ్గుపడదు సినీ నటి జ్యోతి. తెలుగుతో పాటు కన్నడ,మలయాళ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించిన జ్యోతి హంగామా, పెళ్లాం ఊరెళ్తే, రంగా ది దొంగా చిత్రాలతో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో బిగ్ బాస్ 1 సీజన్‌లో అడుగుపెట్టి ఆరంభంలోనే భయటికి వచ్చిన జ్యోతి కంటెస్టెంట్‌లపై సంచలన ఆరోపణలు చేసింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. టాలీవుడ్‌లో తనకు నచ్చిన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పిన జ్యోతి విజయ్ షర్ట్ లేకుండా నటించాలనుందని మనసులోని కోరికను బయటపెట్టింది. విజయ్ నటించిన గీత గోవిందం తనకు నచ్చిన సినిమా అని చెప్పిన ఈ బోల్డ్ బ్యూటీ పవన్‌తో ఛాన్స్‌ వస్తే అస్సలు వదులుకోనని తెలిపింది.

ఇక బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌ ఎవరనే దానిపై లీకులు సైతం ఇచ్చేసింది జ్యోతి. హీరో వరుణ్ సందేశ్, ఉదయభాను, చార్మి సీజన్ 3లో పాల్గొంటున్నారని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 కంటెస్టెంట్స్‌కి చాలా తేడా ఉందన్నారు. బిగ్ బాస్ 1 అప్పుడు కంటెస్టెంట్స్‌లో భయం ఉండేదని..బిగ్‌బాస్‌కు సరిపోయే హోస్ట్ ఎన్టీఆర్‌ని తెలిపింది. కానీ సీజన్ 2కు వచ్చేసరికి కంటెస్టెంట్స్ చాలా చిల్ ఉన్నారు. పిచ్చ లైట్ తెలిపింది జ్యోతి.

- Advertisement -