- Advertisement -
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ గజగజ వణికిస్తోంది. ఇక అమెరికాను ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తుండగా బాధితుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే 18 ఏళ్లలోపు వారి సంఖ్య ఇటీవల నాలుగు రెట్లు పెరిగినట్టు న్యూయార్క్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాలో వారం రోజులుగా రోజుకు సగటున లక్షా 90 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో న్యూయార్క్‌లో ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 5యేళ్ల లోపు చిన్నారులే ఎక్కువ మంది ఉండటం వైద్యులను కంగారు పెట్టిస్తోంది.
ఒమిక్రాన్ కారణంగా అమెరికాలో మళ్లీ మొదటి వేవ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని అమెరికా వైరాలజిస్టు, ప్రభుత్వ సలహాదారు ఆంటోనీ ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ టెస్ట్ కోసం వేలాది మంది ల్యాబ్‌ల ముందు క్యూ కడుతున్నారు.
- Advertisement -