తారక్‌ లాంటి బ్రదర్‌ దొరకడం అదృష్టం: చరణ్

25
ram charan

ఎన్టీఆర్ లాంటి బ్రదర్ దొరకడం తన అదృష్టమన్నారు హీరో రామ్ చరణ్. చెన్నైలో ఆర్‌ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన చరణ్..తాను చనిపోయేవరకు తారక్ స్నేహం మనుస్సులో పెట్టుకుంటానని వెల్లడించారు.దేవుడు తనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం అని వెల్లడించారు చెర్రీ.

ఈ సినిమా కోసం తాలా చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళి గారికి థాంక్స్ అని తెలిపారు. ఆయన గురించి చెప్పడానికి ఒక స్టేజ్ సరిపోదు.. నాకు అవకాశం ఇచ్చినందుకు.. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ని ఇచ్చినందుకు థాంక్స్ అని తెలిపారు చరణ్. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తమిళ్ డబ్బింగ్ చెప్పను అని చెప్పినా.. మాకు నేర్పించి డబ్బింగ్ చెప్పించిన మదన్ గారికి థాంక్స్ అని చెప్పారు.