- Advertisement -
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది ఒమిక్రాన్. ఇప్పటికే 90 దేశాలకు పైగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందగా ఫ్రాన్స్‌లో శరవేగంగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తమైంది ఫ్రాన్స్. వచ్చే ఏడాది వరకు ఒమిక్రాన్ వేరియంట్.. ఫ్రాన్స్‌ను పూర్తిగా కమ్మేస్తుందని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు.
బ్రిటన్ నుంచి వస్తున్న ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. బ్రిటన్‌లో శుక్రవారం ఒకే రోజు సుమారు 15వేల కేసులు నమోదు అయ్యాయి. యూరోప్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తున్నట్లు సంకేతాలు అందాయి. దీంతో అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జర్మనీలో అదనపు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో కూడా కఠిన ఆంక్షలు విధించారు.
- Advertisement -