25న సప్తగిరి…గూడుపుఠాణి

43
gooduputani

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం “గూడుపుఠాణి “. డిసెంబర్ 25న గ్రాండ్‌గా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి వస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సపగిరి ఎల్ఎల్బి తరువాత సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రం ఇది.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. గూడుపుఠాణి చిత్రం కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.