- Advertisement -
వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు 71 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో). ఒమిక్రాన్ ని లైట్‌గా తీసుకోవద్దరి డేంజర్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ సోకినవాళ్లు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారని…కరోనా వేరియంట్లలో ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం అని తేల్చి చెప్పింది.
వారం వ్యవధిలో 71 శాతం ఒమిక్రాన్ కేసులు పెరిగాయని…. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని.. తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు 130 దేశాలకు పైగా ఒమిక్రాన్ కేసులు వ్యాప్తి చెందగా భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒమిక్రాన్,కరోనా ధాటికి దేశంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ అనౌన్స్ చేశాయి.
- Advertisement -