కిరణ్‌ అబ్బవరం..వినరో భాగ్యము విష్ణుకథ

33
kiran abbavaram

యస్‌ఆర్ కళ్యాణ మండపం,రాజావారు రాణివారు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. తాజాగా తన మూడో సినిమాను అనౌన్స్‌చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తుండగా ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణుకథ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఇందుకు సంబంధించి పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. ఒక పక్కగుడి, మరో పక్క మసీదు మధ్యలో గ్రామీణ వాతావరణం కనిపిస్తుండగా హెల్పింగ్ నేచర్ బిగిన్స్ అని పోస్టర్ పై మెన్షన్ చేశారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సూక్తి ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉంటుందని అర్ధమవుతోంది. కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.