శ్రీకాకుళం జిల్లా వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలు..!

140
corona
- Advertisement -

శ్రీకాకుళం జిల్లా ఉమ్మిలాడ గ్రామ నివాసికి ఒమెక్రాన్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని వధంతులు రావడం తో ఉమ్మిలాడ గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్ గా అధికారులు గుర్తించారు. గ్రామానికి వచ్చే ఇతర ప్రాంతాల వాసులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే గ్రామస్థుల కదలికల పై నిఘా పెట్టా రు. గ్రామం లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో వీధుల్లో బ్లీచింగ్ జల్లారు. పోలీసులు పహారా నిర్వహి స్తున్నారు. రెవిన్యూ, వైద్య ఆరోగ్య శాఖసిబ్బంది గ్రామం లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ గ్రామానికి చెందిన సీమేన్ గత నెల 23 న దక్షిణాఫ్రికా నుండి లండన్, ముంబాయి మీదగా విమాన ప్రయాణం చేసి జిల్లాకు చేరుకున్నారు. ఈ ప్రయాణం లో రెండు పర్యాయాలు కోవిడ్ టెస్టులు చేసుకోగా రెండు పర్యాయాలు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వ్యాధి ఉదృ తంగా ఉన్న నేపథ్యం లో ఇతర దేశాలనుండి విమాన ప్రయాణం లో వచ్చే ప్రయాణికులకు టెస్టు లు చేయాలని భారత ప్రభుత్వం ద్వారా ప్రయాణికుల వివరాలు అయా జిల్లా కలెక్టర్లకు పంపించడం తో ఈ నెల 5 న బోరుబద్ర పీహెచ్ సి లో ఆ వ్యక్తికి మరో మారు వైద్య పరీక్షలు నిర్వ హించారు.

ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగి ఉండటం తో అధికారుల్లో ఆందోళ నలు పెరిగాయి. ఇదే సందర్భంలో ఆ వ్యక్తి పలువురితో కాంట్రాక్టు కావ డం, వివాహానికి వెళ్ళడం తో వారిని గుర్తించి మెడికల్ సిబ్బంది చెకప్ లు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కలి గిన ఆ వ్వ్యక్తి మెడికల్ పర్యవేక్షణ లో అదే గ్రామంలో హోమ్ఐసిలోషన్ లో ఉన్నారు. ఒమ్మిలాడకు చెందిన వ్యక్తికి ఒమెక్రాన్ లక్షణాలు ఉన్నా యని మీడియాలో ప్రసారాలు జర గడం జిల్లా ప్రజలకు మరింత ఆందో ళనలకు గురి చేసింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ , రెవిన్యూ అధికారులు ఖండిస్తూ హైదరాబాద్ లో ఉన్న సిసి ఎంబిసికి జినోవా సీక్వెన్స్ కోసంవ్యక్తి శాపిల్స్ పంపించారు. ఆ రిపోర్టు లు వచ్చిన తరువాత వ్యాధి లక్షణాలు తెలుస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -