ఒమర్ ఇంటిపై మనసుపడ్డ కేటీఆర్

199
Omar Abullah

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఇల్లు చూసి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రముగ్ధులయ్యారు. మంచుతో కప్పుకుపోయిన శ్రీనగర్‌లోని ఓమర్‌ ఇంట్లో నివసించాలని ఉందని ట్వీట్ చేశారు. వరాలిచ్చే దేవత ఉంటే నాదో కోరిక..ఆ ఇంటికి దగ్గర్లో ఉండాలని అంటూ కెటిఆర్ మంచు దుప్పటి కప్పుకున్న ఓమర్ అబ్దుల్లా ఇంటి ఫోటోపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఓమర్ నా ఇల్లు మీ ఇల్లుగా భావించి మీ ఇష్ట ప్రకారం ఎప్పుడైనా ఉండవచ్చు అంటూ తెలిపారు.
దీనికి కెటిఆర్ వెంటనే జవాబిస్టూ ఓమర్ సాబ్..మీ ఆహ్వానాన్ని నేను తేలికగా తీసుకోవడం లేదు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఘనవిజయం సాధించగా ఒమర్ అబ్దుల్లా విషెస్ చెప్పారు. ‘శుభాకాంక్షలు.. రానున్న ఐదు సంవత్సరాల పాలన సజావుగా సాగాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. దీనికి ప్రతిగా ఒమర్ అబ్దుల్లాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘మెనీ థ్యాంక్స్ ఒమర్ సాబ్..’ అంటూ ట్వీట్ చేశారు.