డాన్సు బార్లుపై ఆంక్షలు సడలింపు

205
supreme court
- Advertisement -

మందేస్తూ..చిందేస్తే ఆ కిక్కే వేరు..ఇకపై అలాంటి కిక్కుని ఎంజాయ్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చేసింది సుప్రీం. డాన్స్‌ బార్ల రూల్స్‌ను సులభతరం చేస్తూ సుప్రీం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్ రెగ్యులేషన్ చట్టాన్ని మార్చేందుకు సిద్ధమైంది.సరైన అనుమతితో బార్లలో లిక్కర్ తోపాటు డాన్సులు కూడా పెట్టుకునేలా సుప్రీం ఆదేశాల మేరకు నిబంధనలను మార్చింది.

డాన్స్ ఫ్లోర్, లిక్కర్ సర్వ్ చేసే రూముల వేర్వేరుగా ఉండాలన్నది నిబంధన. దాన్ని మార్పు చేసి అంతా కలిసి ఉండొచ్చని సుప్రీం చెప్పింది.స్కూళ్లు, ఆలయాలకు కనీసం కిలోమీటరు దూరంలోనే డాన్స్ బార్లు పెట్టుకోవాలన్న నిబంధన ఆ రాష్ట్ర చట్టంలో ఉండేది. దానిని పాటించడం ముంబైలో సాధ్యం కాదని, దీనిని మార్చాలని మహారాష్ట్ర అసెంబ్లీకి సుప్రీం కోర్టు సూచించింది.

డాన్సర్లకు టిప్పులు ఇవ్వకూడదన్న నిబంధనను మారుస్తూ టిప్పులు ఇవ్వడంలో తప్పులేదని, డబ్బులు అమ్మాయిలపై వెదజల్లడాన్ని మాత్రమే ఆపాలని డైరక్షన్ ఇచ్చింది సుప్రీం.

- Advertisement -