టీ20 వరల్డ్ కప్ ప్రారంభం..

224
- Advertisement -

క్రికెట్‌ ప్రేమికులను అలరించడానికి మరో మహా సంగ్రామం ప్రారంభమైంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్నాయి.. ఒమన్, పాపువా న్యూగినియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అల్ అమేరత్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఒమన్ తో పోల్చితే చాలా చిన్న జట్టయిన పాపువా న్యూగినియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్కోరుబోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్లు టోనీ ఉరా, లెగా సియాకా పెవిలియన్ చేరారు. ఒమన్ బౌలర్లు బిలాల్ ఖాన్, కలీముల్లా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం పాపువా జట్టు స్కోరు 15 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసింది.

ఈ మెగా టోర్నీలో తొలి దశలో 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ జరగనుంది. ఈ 8 జట్ల నుంచి అత్యధిక విజయాలు సాధించిన 4 జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. అక్కడ పెద్ద జట్లతో కలిసి మరోసారి రౌండ్ రాబిన్ లీగ్ ఆడతాయి. ఇక, టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా.. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

రెండంచెల్లో ఈ పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో.. భారత్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా , వెస్టిండీస్ , పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్ ఉన్నాయి.

- Advertisement -