టోల్‌ గేట్స్‌ దగ్గర ‘చిల్లర’ లొల్లి

216
Old Rs. 500 can’t be used at tolls for payments
- Advertisement -

జాతీయ రహదారులపై టోల్‌గేట్‌ల చిల్లర లొల్లి మొదలైంది. అర్థరాత్రి నుంచి కేంద్రం విధించిన గడువు ముగియడంతో టోల్‌ వసూలు చేస్తున్నారు. అయితే పాత 500 నోట్లను టోల్‌గేట్‌ దగ్గరి సిబ్బంది తీసుకోవడం లేదు. దీంతో టోల్ ట్యాక్స్ సిబ్బందికి వాహనదారులకు ఘర్షణలు తలెత్తుతున్నాయి. కొత్తనోట్లు లేవంటూ వాహనదారులు లబోదిబోమంటున్నారు. పాతనోట్లు తీసుకోవాలని కోరుతున్నారు. పాతనోట్లను టోల్‌గేట్‌ సిబ్బంది అనుమతించకపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

జేబులో రెండు వేల నోట్లు ఉన్నా…ఎక్కడా చిల్లర ఇవ్వటం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2వేల రూపాయలనోట్లకు అందరికీ చిల్లర ఇవ్వలేకపోతున్నారు టోల్ నిర్వాహకులు. స్వైపింగ్ మెషీన్లు కూడా కొన్ని టోల్ గేట్ల దగ్గర అందుబాటులోకి వచ్చాయి. ఐతే.. అవి సరిగా పనిచేయకపోవడంతో… కష్టాలు కంటిన్యూఅవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో స్వైపింగ్ మెషీన్ పనిచేయడం లేదు.. సిగ్నల్ సరిగా లేక.. చార్జింగ్ ఉండక…. కార్డు స్వైప్ కావడం లేదు. దీంతో.. అనవసర చిల్లర గొడవలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి.

traffic-jam-delhi

యాదాద్రి జిల్లా భువనగిరి -వరంగల్ హైవేపై టోల్ గేట్ల దగ్గర కొంత ట్రాఫిక్ స్లోగా రన్ అవుతోంది. చిల్లర కష్టాలు కొనసాగుతున్నాయి. కార్డు స్వైపింగ్ మెషీన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. అటు విజయవాడ- హైదరాబాద్ హైవేపై… ట్రాఫిక్ స్తంభించకుండా.. పోలీసులు.. అధికారులు అన్ని టోల్ ప్లాజాల్లో రాత్రి నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -