ఒక్క హిట్ తో ఎక్కడికో వెళ్ళింది

59
- Advertisement -

కావ్య కళ్యాణ్‌రామ్ తెలుగు అమ్మాయి. పైగా భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. ఎప్పుడో 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బలగం తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క హిట్ తో కావ్య కళ్యాణ్‌రామ్ రేంజ్ మారిపోయింది. మొన్నటివరకూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ లా చూసిన వాళ్ళు కూడా.. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా మర్యాద ఇస్తున్నారు. బలగం సినిమా రిలీజ్ కి ముందు దిల్ రాజు అఫీస్ కి వెళ్తే.. గంట వెయిట్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు అమ్మడు అడుగు పెట్టగానే ఎదురు వెళ్లి లోపలికి తీసుకువెళ్తున్నారు.

మొత్తానికి కావ్య కళ్యాణ్‌రామ్ కి కాలం కలిసి వచ్చింది. అదేంటో.. టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉన్నా.. అందాల భామల కొరత ఎప్పుడు ఉంటూనే వస్తోంది. ముఖ్యంగా తెలుగు వచ్చిన హీరోయిన్ దొరకడం అరుదు అయిపోయింది. భాష వస్తే.. నటన రాదు, నటన వస్తే భాష రాదు. ఈ రెండు వచ్చిన కావ్య కళ్యాణ్‌రామ్ లాంటి హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే.. కావ్య కళ్యాణ్‌రామ్ కి ఇప్పుడు డిమాండ్ పెరిగింది.ప్రస్తుతం వరుస ఆఫర్లతో కృతి శెట్టి, శ్రీలీల వంటివారు తెలుగు తెరను ఏలేస్తున్నారు.

మొదటి హిట్ పడకుండానే శ్రీలీల లాంటి హీరోయిన్ అయితే మూడేసి సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. దీనికితోడు మృణాల్ ఠాకూర్, ఆషిక రంగనాథ్ లాంటి భామలు కూడా రేసులోకి వచ్చారు. ఇలాంటి సమయంలో సడెన్ గా పేరు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్‌రామ్. చక్కని కనుముక్కు తీరుతో కావ్య కళ్యాణ్‌రామ్ యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది, ఈ నేపథ్యంలో ఈ సుందరిని వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వస్తున్నాయని టాక్. మొత్తానికి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసి.. మేకర్స్ దృష్టిని ఆకర్షించింది కావ్య. దీంతో ఒక్క హిట్ తో అమ్మడు ఎక్కడికో వెళ్ళిపోయింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : వారసురాలు ఘాటు అందాలు

KGF:రాఖీ భాయి ఎక్కడ? హింట్ ఇచ్చిన హోంబలే..!

Agent:’ది గాడ్’గా డినో మోరియా

- Advertisement -