రివ్యూ: ఒకే ఒక జీవితం

175
Oke-Oka-Jeevitham
- Advertisement -

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమల అక్కినేని, రీతూ వర్మ ప్రధానపాత్రల్లో నటించగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఈ సినిమాతో శర్వా హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

కథ ముగ్గురు స్నేహితులతో మొదలవుతుంది. ఆది (శ‌ర్వానంద్‌). త‌ను మంచి గిటారిస్ట్ మ్యూజిక్ రంగంలో త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని చూస్తుంటాడు. కానీ స్టేజ్‌పై పాడాలంటే త‌న‌కు భ‌యం. రెండోవాడు చైతన్య (ప్రియ‌ద‌ర్శి) మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంటాడు. ఏ అమ్మాయి ఓ ప‌ట్టానా న‌చ్చ‌దు. మూడోవాడు శ్రీను (వెన్నెల కిషోర్‌) చిన్న‌ప్పుడు స‌రిగ్గా చ‌దువుకోక‌పోవ‌టంతో హౌస్ బ్రోక‌ర్‌గా మారుతాడు. ఇలా ఉన్న వీరి జీవితాల్లోకి సైంటిస్ట్ రంగి కుట్టా పాల్ (నాజ‌ర్‌) ప్ర‌వేశిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది…?వారికి ఎదురైన అనుభవం ఎలాంటిది? చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ?

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథాంశం, శర్వానంద్ పెర్ఫార్మెన్స్ ,వెన్నెల కిషోర్ కామెడీ,విజువల్ క్వాలిటీ ఎమోషన్స్. శ‌ర్వానంద్ తన పాత్ర‌లో ఒదిగిపోయారు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హీరో పాత్ర‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో చ‌క్క‌గా నటించారు. హీరోయిన్ రీతూ వ‌ర్మ పాత్ర‌కు న్యాయం చేసింది. అక్కినేని అమల, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ చిన్న‌ప్పుడు తాము చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌ని చేసే ప్ర‌య‌త్నాలకు సంబంధించిన స‌న్నివేశాల్లో కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, పాటలు లేకపోవడం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. త‌రుణ్ భాస్క‌ర్ రైట‌ర్‌గా మంచి సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. భావోద్వేగ స‌న్నివేశాల్లో త‌న డైలాగులు మ‌రింత‌గా పండాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతంలో పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంద‌నటంలో సందేహం లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

జీవితం ఎవ‌రికీ రెండో అవ‌కాశం ఇవ్వ‌దు. ఒకవేళ అలాంటి అవ‌కాశం వ‌స్తే .. విధి రాత‌ను మార్చుకోగ‌ల‌మా! అనే పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ రాసుకున్న క‌థే ‘ఒకే ఒక జీవితం’. ముగ్గురు యువ‌కుల్లో హీర శ‌ర్వానంద్‌కు ఈ మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను యాడ్ చేసి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గచిత్రం ఒకే ఒక జీవితం.

విడుదల తేదీ:09/09/2022
రేటింగ్: 3/5
నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత:డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌
దర్శకుడు: శ్రీకార్తీక్

- Advertisement -