సూర్య 42…మోషన్ పోస్టర్!

90
suriya-42
- Advertisement -

ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో జోష్ మీదున్న హీరో సూర్య తన 42 వ సినిమాని మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళంతో పాటు 10 భాషలో ఈ సినిమా విడుదలకాబోతున్నట్టు ఆ పోస్టర్ లో ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ , తమిళ్ నిర్మాణ సంస్థ “స్టూడియో గ్రీన్”తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -