ఒకే ఒక జీవితం ఒకటే కదా లిరికల్ వీడియో విడుదల!

126
oke oka
- Advertisement -

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ”ఒకటే కదా” సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్‌మేట్‌ సెర్చింగ్ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం యూత్ ఫుల్, ట్రెండీ ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది.

ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు, ఒకటే కదా పాట బ్రిలియంట్ కంపోజిషన్, ఆకట్టుకునే సాహిత్యం, వాయిస్ తో అలరిస్తోంది.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా, సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: శ్రీ కార్తీక్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
డీవోపీ: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్: ఎన్.సతీష్ కుమార్
స్టంట్స్: సుదేష్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్

- Advertisement -