ఫిబ్రవరి 7న ‘ఒక పథకం ప్రకారం’

0
- Advertisement -

‘143’, ‘బంపర్ ఆఫర్’ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సాయిరాం శంకర్ నుండి రాబోతోన్న మరో విభిన్న కథా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్‌తో పాటు గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ… ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే డైరెక్టర్‌గారు, నిర్మాతగారు, నేను ఇలా లాయర్ గెటప్‌లో వచ్చాం. ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్‌ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్ ఇస్తుంది. దర్శకుడు వినోద్ విజయన్ ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా బెర్లిన్ అవార్డ్‌ను గెలుచుకుంది. ‘ఒట్టాల్’ అనే ఆ సినిమా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. అంటే ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. వినోద్‌తో నాకు 2005 నుండి పరిచయం ఉంది. అప్పటి నుండి మా మధ్య స్నేహం నడుస్తూనే ఉంది. ఎప్పుడూ సినిమా చేయడానికి కుదరలేదు. కానీ ఈ కథ చెప్పినప్పుడు నేచరే పంపించి ఉంటుందని అనిపించింది. వినోద్‌తో పాటు వినీత్‌ అనే అతను ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు, వారిద్దరూ నాకు కామన్ ఫ్రెండ్స్ కావడంతో.. ఇద్దరికీ నా పేరే మైండ్‌లో ఉంది. అలా నా దగ్గరకు ఈ కథ వచ్చింది. ఈ సినిమాను నేను చాలా ఇష్టపడి చేశాను. నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది. స్క్రీన్‌ప్లే, కథ, నన్ను ప్రొజక్ట్ చేసిన విధానం అన్నీ కూడా నాకు వంద శాతం ఉపయోగపడే సినిమా. చాలా కొత్తగా ఉంటుంది. సినిమా మొదలైనప్పటి నుండి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీల్ ఇస్తూ.. ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు అనుకోకపోతే.. నన్ను తిట్టుకోవచ్చు.. వీడు ఇంతేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఈ సినిమా ఇవ్వదని నాకు తెలుసు. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండు రోజులు షూటింగ్ పూర్తయిన తర్వాత.. నా పాత్రలో చాలా డ్రామా ఉందని అర్థమైంది. 3 రోజుల తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి దర్శకుడు తన ఫ్రెండ్‌ని పిలిపించగా.. నెల రోజుల పాటు ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నా. అంత ఇంటెన్సిటి, న్యాచురల్ ఇందులో ఉంటుంది. ఈ సినిమా కోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానేమో. నిజంగా నా వెయిటింగ్‌కి సరిపడా నాకు ఉపయోగపడే సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత అందరూ నేను జెన్యూన్‌గా చెప్పానని అనుకుంటారు. కచ్చితంగా టీమ్‌ని అభినందిస్తారు. నిర్మాత గార్లపాటి రమేష్‌గారు, దర్శకుడు వినోద్ విజయన్, జీను భాయ్, స్వాతి గార్ల సపోర్ట్‌తో సినిమా మొదలైందన్నారు.

నిర్మాత గార్లపాటి రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఒక పథకం ప్రకారం’ అనే ఒక మంచి మూవీతో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అందరూ ఈ సినిమాను చూసి హర్షిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు సాయిరామ్ శంకర్‌గారు ఎంతో కష్టపడ్డారు. ఇంతకు ముందు సినిమాలకు ఆయన ఇంత కష్టపడ్డారో లేదో తెలియదు కానీ.. నేను ప్రాక్టీకల్‌గా చూశాను. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. అలాగే వినోద్ విజయన్ ఈ సినిమాను టెక్నికల్‌గా చాలా గొప్పగా తీశారు. మూవీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఫిబ్రవరి 7న మీ ముందుకు వస్తున్నాము. అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాన’’ని అన్నారు.

చిత్ర దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ… ‘‘సాయిరామ్ శంకర్ గారితో ‘ఒక పథకం ప్రకారం’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీశాను. అందరూ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. సాయిరామ్ శంకర్‌గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’’ అని చెప్పుకొచ్చారు.

Also Read:రెండో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు..

- Advertisement -