జక్కన్నపై సోషల్ మీడియాలో సెటైర్లు

286
- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది. ఆయన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా రూపొందుతోన్న ‘బాహుబలి 2’ చిత్రానికి సంబంధించి రానా దగ్గుబాటి ఫస్ట్‌లుక్‌ను ని విడుదల చేస్తే డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది. రానా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘అంతం చేయడానికి బలశాలి భల్లాలదేవ బయటకు వచ్చాడు’ అని రాజమౌళి ట్వీట్‌ చేస్తూ.. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పుడు రానా ఫస్ట్ లుక్‌ పై సోషల్ మీడియాలో రాజమౌళిపై సెటైర్ల జల్లు కురుస్తోంది. ఈ లుక్ చూసిన కొందరు అభిమానులు రాజమౌళి క్రియేటివిటీని కొనియాడుతుంటే మరికొందరు మాత్రం దీనిపై సెటైర్లు వేస్తున్నారు. బల్లాలదేవ కాస్ట్యూమ్స్ కార్టూన్ బొమ్మలను గుర్తుకు తెస్తున్నాయని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కంకిపాడులో డిజైన్ చేయించారా? పచ్చరంగా ఐరన్ మ్యాన్ సూటు వేయించారా అంటూ రాజమౌళిని వెంటాడుతున్నారు. మరికొందరైతే.. కార్టూన్ గేమ్ ‘పవర్ రేంజర్’ సూటును కాపీ కొట్టారని, రానా ఐరన్ మ్యాన్‌లా ఉన్నాడని రాజమౌళిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

Baahubali 2 First Look Poster Disappointed

‘ఏ పల్లెటూళ్లో చేయించారో’.. ‘ఐరన్ మ్యాన్ కి పసుపు సూట్ వేశారా’.. ‘ఫ్యాన్ మేడ్ లా ఉందంతే’.. ఇలాంటి ట్రాలింగ్ కూడా మొదలైపోయింది. బాహుబలి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ రేంజ్ ట్రాలింగ్ ఇదే మొదటిసారి అని చెప్పాలి. మొత్తానికి.. బాహుబలి ది బిగినింగ్ వ్యూహం.. బాహుబలి ది కంక్లూజన్ కు వర్కవుట్ అయ్యేట్లుగా కనిపించడం లేదు.

Baahubali 2

బాహుబలి మొదటి పార్ట్ సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మేడే సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. .రాజమౌళి ఎవరూ ఊహించని విధంగా పోస్టర్ విడుదల చేసారని, అతని ఐడియా సూపర్ అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని గంటల్లోనే రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ కాన్సెప్టు 1998లో వచ్చిన ‘సిమన్ బిర్చ్’ అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా బాహుబలి 2 విషయంలో కాపీ కాకపోయినా….ఫస్ట్ లుక్‌ అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

- Advertisement -