కవితను కలిసిన ఒగ్గు కళాకారుల సంఘం ప్రతినిధులు..

26
mlc kavitha

తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల‌ కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం ఒగ్గు కళాకారులు బహుకరించిన తాళాన్ని ఎమ్మెల్సీ కవిత కాసేపు వాయించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సింగారపు ఓదెలు, అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.