రంజాన్ పండుగ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష..

195
GHMC Commissioner Dana Kishore

హైదరాబాద్ రానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగర పోలీసుల తరఫున సాలర్జంగ్ మ్యూజియంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌ హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనికుమార్ మరియు జిహెచ్‌యంసి కమీషనర్ దానకిశోర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, పోలీస్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అంబర్ కిషోర్, ఇంజినీర్లు, జలమండలి, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసులు, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిహెచ్‌యంసి కమీషనర్ మాట్లాడుతూ.. వేస్టేజీ ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రయత్నిస్తాము. జిహెచ్‌యంసి తరఫున వాటర్ ప్యాకెట్లు సరఫరా చేస్తాం అని తెలిపారు. రానున్న మూడు నెలల్లో పాతబస్తీ రహదారుల విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు. చార్మినార్ జోన్‌లో పలు ప్రాజెక్టుల భూసేకరణను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రంజాన్ సందర్భంగా ప్రార్థన స్థలాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తామన్నారు.

GHMC Commissioner Dana Kishore

నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ జిహెచ్‌యంసి మరియు పోలీసుల తరఫున ఎలాంటి సహాయంఅయిన కల్పించడానికి సిధంగా ఉన్నాం. పికెటింగ్ మరియ పెట్రోలింగ్‌లో చాలా తేడా ఉంది ఎవరికి ఏవిధమైన సెక్యూరిటీ కావాలో ఆవిధంగా మేము కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌లో రోజుకు 8వేల నుండి 10వేల కేసులు నమోదవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది నేరం చేసిన వారు ఒకే రోజులో పట్టుబడుతారు. వైట్నర్ వ్యక్తులు తమ వైఖరి మార్చుకోండి. ఐదు నిమిషాల సంతోషం కోసం ఐదు సంవత్సరాలు నష్టపోతారు. పోలిస్ నుండి ఒక అవకాశం ఇస్తాం తీరు మార్చుకుంటే రౌడి షీట్లు ఎత్తివేస్తామని కమీషనర్‌ తెలిపారు

ఈద్గాలో రంజాన్ రోజు లక్షల మంది నమాజ్ చేస్తారు ఆ నమాజ్ కు ఒక ప్రత్యేకత ఉంది. రంజాన్ మాసంలో అందరూ మంచి పద్ధతికి అలవాటు పడతారు ఆ పద్దతి ఎప్పటికి అలవాటు చేసుకోవాలి. ఇండియాలో హైదరాబాద్ కు బెస్ట్ లీవ్అబుల్ అవార్డు వచ్చింది. అందరూ నేను సైతం కార్యక్రమంలో పాల్గొని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపారు. రంజాన్ ను అందరూ శాంతి జరుపుకోవాలని ఆయన కోరారు.