‘ఎర్రచీర’లో ప్రత్యేక ఆకర్షణగా హీరో శ్రీరామ్..!

162
Actor Sriram

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి డమరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎర్రచీర’. సీహెచ్ సుమన్‌బాబు స్వీయదర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఈ సినిమాలో ‘శ్రీరామ్’ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తెలిపారు. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా ఉండబోతున్నాయని, ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

Actor Sriram

ద‌ర్శ‌క‌నిర్మాత‌ సుమన్‌బాబు మాట్లాడుతూ-“మొదటి షెడ్యూల్ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను చిత్రీకరించాం. రెండో షెడ్యూల్లో మాత్రం కామెడీ, యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నాం. ఈ నెల 15వ తేదీన రెండో షెడ్యూల్ తెర‌కెక్కిస్తాం. మదర్ సెంటిమెంట్.. హార‌ర్ ఈ సినిమాలో ప్ర‌ధాన హైలైట్. శ్రీ‌రామ్ పాత్ర అంతే ప్ర‌త్యేకంగా ఉంటుంది“ అన్నారు.

సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, .కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌, సురేష్ కొండేటి, మహానటి ఫేం బేబీ సాయి తుషితలు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: చందు, మాటలు: గోపీవిమలపుత్ర, మ్యూజిక్: ప్రమోద్ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సీహెచ్ సుమన్‌బాబు.