తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత జీజేపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ఇతరరాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు బిఆర్‌ఎస్ తో చేతులు కలిపేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. తెలంగాణలో కేసిఆర్ అందించిన సుపరిపాలన కు ఆకర్షితులవుతున్న దేశ ప్రజలు కూడా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ ను భావిస్తున్నారు. అందుకే బిఆర్‌ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ కు మద్దతు భారీగా పెరుగుతోంది. దాంతో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా బిఆర్‌ఎస్ ను అన్నీ రాష్ట్రాల్లో విస్తరించే పనిలో కేసిఆర్ నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాలలోని కీలక నేతలు చాలమంది బిఆర్‌ఎస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. .
ఇదిలా ఉంచితే ఒడిశా మాజీ సిఎం గిరిధర్ గమాంగ్ ఇవాళ అధికారికంగా బిఆర్‌ఎస్ లో చేరానున్నారు. ఆయనతో పాటు ఒడిశా లోని ఇంకొంత మంది నేతలు కూడా బిఆర్‌ఎస్ గూటికి చేరబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విధంగా జాతీయ పార్టీగా అనౌన్స్ అయిన కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా అందరి దృష్టి బిఆర్‌ఎస్ పై పడడంతో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనే చర్చ గట్టిగానే జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి.. కేసిఆర్ వైపు చూసేలా చేస్తోంది. దాంతో బిఆర్‌ఎస్ విస్తరణ బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఆనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..