హైదరాబాద్‌ మెట్రోకు ఎలాంటి ప్రమాదం లేదు..

125
nvs reddy

భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సెలవులు ప్రకటించగా హైదరాబాద్‌ మెట్రోకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి.

వరదలతో మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరిందని, వరదకు మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందని తెలిపారు. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

భారీ వర్షాలతో పలు చోట్ల మెట్రో పిల్లర్ల వద్ద నీరు నిలిచింది. దీంతో మెట్రో పిల్లర్లకు ప్రమాదం ఉందంటూ పలు చానెళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి.ఈ నేపథ్యంలోనే స్పందించిన మెట్రో ఎండీ వాటిని ఖండించారు.