యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఈ సినిమాలో ఎంతటివాడినైనా ఎదుర్కునే పాత్రలో.. ఎదురులేని పాత్రలో ఎన్టీఆర్ కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడు. అలాంటి ఎన్టీఆర్‌ను తాజా చిత్రంలో కొరటాల ఎలా చూపించనున్నాడని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపించనున్నాడని అంటున్నారు. విలేజ్‌లో అమాయకంగా తిరిగే ఈ పాత్ర ఒకానొక సందర్భంలో సిటీకి వెళ్లవలసి వస్తుందట. అక్కడ ఏం జరుగుతుంది? అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. ఇక కొరటాల గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలోను ఒక సందేశం ఉంటుందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీని ఎన్టీఆర్‌కు జోడీగా నటించనుందని టాక్. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.