ఇది ఒక కొత్త రకం కథ- హీరో తేజ స‌జ్జ‌‌

290
- Advertisement -

దక్షినాదిలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంతో య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఈరోజు సుప్రీమ్ హీరో సాయి తేజ్ విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో…

వాకాడ అప్పారావు మాట్లాడుతూ – సూపర్‌గుడ్‌ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ రెండు ఒక్కటే. మా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ ద్వారా గడిచిన ఇరవైఏళ్లలో ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్స్, మెగా హిట్స్‌ అందించాము. తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉండటం, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరేడుఏళ్ళుగా తెలుగులో సినిమాలు తీయలేకపోయాము. అందుకు చాలా బాధగా ఉంది. కొంతగ్యాప్‌ తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న చిత్రం ఇష్క్‌. ఇందులో తేజ, ప్రియా ప్రకాష్‌ వారియర్లతో పాటుగా తమిళ నటుడు రవీందర్‌ ఓ కీ రోల్ చేశారు. నటీనటులతో పాటుగా సాంకేతికనిపుణులు కూడా బాగా వర్క్‌ చేశారు. మా సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు

ఈ చిత్ర దర్శకుడు య‌స్‌.య‌స్‌. రాజు మాట్లాడుతూ – `నా గురువుగారు కెమెరామేన్‌ సమీర్‌రెడ్డిగారి వల్ల నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, వాకాడా అప్పారావు, వాకాడా అప్పారావు, జైన్‌గార్లకు థ్యాంక్స్‌. నా జీవితాంతం వీరందరికి రుణపడి ఉంటాను. ఈ సినిమాను 29 డేస్‌లో ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం ఎన్వీప్రసాద్, వాకాడ అప్పారావు, శ్యామ్‌కేనాయుడు గార్లకు థ్యాంక్స్‌. నిర్మాణ పరంగా ఎన్వీప్రసాద్‌గారు, స్క్రిప్ట్‌ లెవల్‌ నుంచి అప్పారావుగారు, పిక్చర్‌ క్వాలిటీ పరంగా శ్యామ్‌కేనాయుడు బాగా సహకరించారు. తేజ‌, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నా టీమ్‌లో నాకు స‌హ‌క‌రించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ – మళ‌యాలంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఓ మంచి సినిమాను తెలుగులో ఇష్క్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మెగా గుడ్‌ ఫిలింస్‌ సంస్థలో సినిమా అంటేనే రిచ్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే ఉండ‌బోతుంది. కొత్త త‌ర‌హా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల అందరికీ ఇష్క్‌ సినిమా నచ్చుతుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వ‌ర‌కూ ప్రేక్షకుల‌ను ఎంగేజ్ చేస్తుంది. జాంబీరెడ్డి సినిమాతో తేజ తొలి సక్సెస్‌ కొట్టాడు. ఈ సినిమా తేజ ఖాతాలో మరో సక్సెస్‌గా నిలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి చిత్రయూనిట్‌ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ – తేజ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరోలా కనిపిస్తున్నాడు. ‘జాంబీరెడ్డి` వంటి మంచి సినిమా తర్వాత మెగా సూపర్‌గుడ్‌ఫిలింస్‌ సంస్థ వంటి మంచి బ్యానర్‌లో తేజ సజ్జా చేసిన ఇష్క్ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘మా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో సాయితేజ్‌ గారికి ధన్యవాదాలు. అలాగే ‘ఇష్క్‌’ టైటిల్‌తో నితిన్‌ సినిమా ఉంది. మీ సినిమా టైటిల్‌ ఉపయోగించుకుంటున్నాము అనగానే నితిన్‌ సరే అనడమే కాకుండా…మా సినిమాలోని ‘ఆనందం…’సాంగ్‌ కూడా ఆయన రిలీజ్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్‌ 23న మా ‘ఇష్క్‌’ సినిమా థియేటర్స్‌లో వస్తుంది. ఇది ఒక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్‌ జానర్‌ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్‌’. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆడియన్స్‌కు న్యూ కైండ్‌ ఆఫ్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కొంత గ్యాప్‌ తర్వాత వ‌స్తున్న మెగాసూపర్‌గుడ్‌ ఫిలింస్ వారు ఫ‌స్ట్ సినిమా నాతో చేయ‌డం సంతోషంగా ఉంది. ‌ మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలనే ఈ సంస్థ వారు ప్రొత్సహిస్తుంటారు. ‘ఇష్క్‌’ సినిమాలో కూడా మంచి కంటెంట్‌ ఉంది. త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి న‌చ్చే చిత్ర‌మిది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత వాకాడ అంజ‌న్ కుమార్, సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్, మ‌రియు ఇత‌ర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

తారాగ‌ణం:తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్, తమిళ నటుడు రవీందర్‌
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

- Advertisement -