NTR30 ఆచార్యతో పోలికేంటి ?

14
- Advertisement -

ఎన్టీఆర్ , కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈవేడుకలో పాన్ ఇండియా దర్శకులు రాజమౌళి , ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ ఈవెంట్ లో కొరటాల స్టోరీ లైన్ చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.

“ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటారు, దేవుడు అంటే భయం లేదు చావు అంటే భయం లేదు కానీ ఒకే ఒక్కటి అంటే భయం ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది” అంటూ ఎన్టీఆర్ కేరెక్టర్ కూడా ఎలివేట్ చేశాడు కొరటాల. అయితే ఈ స్టోరీ అటు ఇటుగా ఆచార్య ను పోలి ఉందంటూ కొరటాల మళ్ళీ అదే కథతో సినిమా చేస్తున్నాడా ? అంటూ నెటిజన్లు , తారక్ యాంటీ ఫ్యాన్స్ పాద ఘట్టం 2 అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి కొరటాల చెప్పిన స్టోరీ తో ఆచార్య కి క పోలిక ఉంది. కానీ అదే కథతో సినిమా ఉంటుందా ? అనేది ఇప్పడే చెప్పలేం. ఓపెనింగ్ కే కథ ఇదంటూ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొరటాల శివ మాత్రం ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ వర్క్ అవుతుందని గట్టి నమ్మకంతో చెప్పుకున్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఈ సినిమాతో స్ట్రాంగ్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

ఖుషి కి రిలీజ్ డేట్ ఫిక్స్

దేవకన్య సమంతలా దిగొచ్చింది

మే 18..సామజవరగమన విడుదల

- Advertisement -