దేవకన్య సమంతలా దిగొచ్చింది

19
- Advertisement -

సమంత మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’ నుంచి తాజాగా ససమంత లుక్ ను రివీల్ చేస్తూ.. మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సమంత మహారాణి లుక్ లో అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ పోస్టర్ కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను దరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ మహారాణి లుక్ రావడం కోసం సమంత సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మేకప్ వేయించుకుంది.

మొత్తానికి సమంత కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చీరలో అందాల తారలు మరింత అందంగా కనిపిస్తారని సమంత పోస్టర్ తో మరోసారి రుజువు అయ్యింది. తళుకుబెళుకుల చీరలో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా సమంత మెరిసిపోతోంది. తన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా సమంత తన లేటెస్ట్ లుక్ తో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అసలు మగువ అందాన్ని రెట్టింపు చేసే దుస్తుల్లో చీరలదే మొదటి ప్లేస్.

ఒక తన ఒంపుసొంపుల్ని అందంగా చూపించడంలో.. ఆ అందాలను కనిపించీ కనిపించకుండా ఊరించేలా చేయడంలో సమంత ఆరితేరిపోయింది. అసలు సమంత తాజా చీర లుక్ చూశాక, ఇక ఎన్ని మాటలు ముచ్చటించుకున్నా తక్కువే. మెరుపుల చీరకు, అదే రంగు బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో సమంత అదరగొడుతోంది. ఈ ఒక్క స్టిల్ తో సామ్ నెటిజన్లు మనసును సాంతం దోచింది. పై నుంచి కిందివరకు ఒకే రంగు అయినా, కాస్త వెరైటీ ఫోజు పెట్టి అద్భుతం అనిపించింది. అచ్చం దేవకన్య ఫోజులో మ్యాచింగ్ సారీలో సమంత మైమరిపిస్తుంది.

మొత్తమ్మీద సమంత ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘సమంత న్యాచురల్ బ్యూటీ’ అంటూ కొందరు, ‘దేవకన్య సమంత రూపంలో దిగొచ్చింది’ అంటూ మరికొందరు తమ స్పందనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి మీ కామెంట్లను కూడా కింద కామెంట్ల రూపంలో తెలపండి.

ఇవి కూడా చదవండి…

మే 18..సామజవరగమన విడుదల

రేపట్నుంచి సైంధవ్ షూటింగ్‌ షురూ.!

గ్రాండ్‌గా NTR30 లాంఛ్..

- Advertisement -