ఖుషి కి రిలీజ్ డేట్ ఫిక్స్

16
- Advertisement -

విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ మొదలైన కొని రోజులకే మేకర్స్ ఈ సినిమాను గతేడాది డిసెంబర్ లో క్రిస్మస్ కనుగా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. కానీ సమంత అనారోగ్యానికి గురవ్వడం, షూటింగ్ వాయిదా పడటంతో ఆ రిలీజ్ డేట్ అందుకోలేకపోయారు.

తాజాగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విజయ్ , సమంత పోస్టర్ తో రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1న కలవబోతున్నాయని చెప్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు. విజయ్ , సమంత కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇది వరకు మహానటి లో జోడీగా కనిపించారు.

సమంత ప్రస్తుతం ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చింది. మధ్యలో శాకుంతలం ప్రమోషన్ చేసుకొని మళ్ళీ ఖుషి సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. ఆగస్ట్ కల్లా టోటల్ వర్క్ ఫినిష్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

రేపట్నుంచి సైంధవ్ షూటింగ్‌ షురూ.!

దేవకన్య సమంతలా దిగొచ్చింది

మే 18..సామజవరగమన విడుదల

- Advertisement -