నందమూరి తారక రామారావు (NTR) మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు తలసేమియా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ద్వారా పునర్జన్మ నివ్వవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సమాజంలోని అన్ని వర్గాల వారిని ప్రోత్సహించేలా ఈ రన్‌ను మూడు ప్రత్యేక విభాగాల్లో నిర్వహించారు. సామాన్య ప్రజలే కాకుండా పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు: సీపీ వి.సి. సజ్జనార్, ఎమ్మెల్యే మల్లారెడ్డి , భారత మహిళ క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
తలసేమియా అనేది జన్యుపరమైన రక్తహీనత సమస్య. దీనితో బాధపడే చిన్నారులకు ప్రతి నెలా రక్తమార్పిడి తప్పనిసరి.
అవగాహన: పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ఎలా అరికట్టవచ్చనే అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం.
నిధుల సేకరణ: ఈ రన్ ద్వారా సేకరించిన నిధులను తలసేమియా బాధితుల ఉచిత చికిత్స, రక్తమార్పిడి సేవలకు వినియోగించనున్నారు.
Also Read:కేరళ సీఎం..రేసులో ఆ ఇద్దరు?
నెక్లెస్ రోడ్డు వెంట సాగిన ఈ పరుగులో వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు పాల్గొని “తలసేమియా రహిత సమాజం” కోసం ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

