ఒక నిజం గడప దాటే లోగా ఓ అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అని సామెత. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి అబద్ధాలు.. అదేనండి పుకార్లు తెగ షికార్లు చేస్తాయి. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆశ్చర్యానికి కూడా గురు చేస్తుంటాయి. అలాంటి పుకారు ఒకటి తాజాగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ ను రానున్న రోజుల్లో వెండితెర పై చూడొచ్చు అట. వరల్డ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మహేష్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడట.
పక్కా అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ – మహేష్ బాబు కాంబినేషన్ అనే సరికి ఈ సినిమా పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. పైగా ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాతోనే ఇంటర్ నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. పైగా రాజమౌళి షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సహజంగా ప్రతి సీన్ ను ఎమోషన్స్ తో డ్రైవ్ చేయడం, పైగా ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం రాజమౌళి స్టైల్.
మరి ఇలాంటి దర్శకుడు ఎన్టీఆర్ – మహేష్ లను పెట్టి.. కొన్ని యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశాడు అంటే.. ఇక అవి ఏ రేంజ్ లో ఉంటాయి ?, అందుకే ఈ సినిమా కోసం మహేష్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతైనా ఎన్టీఆర్ – మహేష్ లకు కూడా ఆర్ఆర్ఆర్ టైప్ సినిమా పడితే.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే. అందుకే రాజమౌళి కొత్త సినిమాకి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. ఎన్టీఆర్ – మహేష్ చేసే విజువల్ యాక్షన్ విన్యాసాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. మరి ఈ పుకారులో కొంతైనా వాస్తవం ఉందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి…