రంగమార్తండ..క్లీన్ యు

15
- Advertisement -

చాలాకాలం గ్యాప్ తర్వాత క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మరాఠి క్లాసిక్‌ నట సామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న రంగ మార్తండతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రకాజ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది ఈ చిత్రం.రంగమార్తాండకు క్లీన్ U సర్టిఫికేట్ లభించగా మార్చి 22, 2023న థియేటర్లలోకి రానుంది.

ఈ ఎమోషనల్ డ్రామాలో శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ మరియు అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -