ఎన్టీఆర్, తేజ్, లావణ్య అభినందనలు

55
- Advertisement -

మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే . దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రామ్ చరణ్ దంపతులకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉపాసన, రామ్ చరణ్‌లకు శుభాకాంక్షలు తెలిపింది. లిటిల్ ప్రిన్సెస్‌ను పొందిన అందమైన జంటకు అభినందనలు అంటూ ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు తెలియజేశారు.

ఇంతకీ ఎన్టీఆర్ ఏం ట్వీట్ చేశాడంటే.. ‘కంగ్రాట్యులేషన్స్ రామ్ చరణ్, ఉపాసన. పేరెంట్స్ క్లబ్ లోకి స్వాగతం. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మర్చిపోలేము. ఆ దేవుడి ఆశీస్సులతో పాప, మీరు అనందంగా ఉండాలంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ ట్వీట్ చేశాడు. ఇంటి చిన్నారికి స్వాగతం అంటూ.. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు.

Also Read: మెగా ప్రిన్సెస్ జాతకం ఇదే

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని తెలియగానే మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్’కు స్వాగతం అంటూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. మొత్తానికి మెగా వారసురాలు తన రాకతో లక్షలాది మందికి సంతోషాన్ని నింపింది.

Also Read: ట్రెండింగ్ లో ‘మెగా ప్రిన్సెస్’

- Advertisement -