నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది! గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఎన్టీఆర్ తన కెరీర్‌లో 31వ చిత్రంగా (NTR 31) ఈ సినిమాను చేస్తున్నారు. ‘కె.జి.యఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రశాంత్ నీల్, తారక్‌ను సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చే ఎన్టీఆర్, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మే 20న చిత్రానికి సంబంధించిన మొట్టమొదటి గ్లింప్స్ (Glimpse) ఆ రోజున విడుదల కానుంది.
ఈ వీడియోతో సినిమా టైటిల్ లేదా ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌ను రివీల్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. ఒక బలమైన ఎమోషనల్ పాయింట్‌తో ఈ సినిమాను నీల్ డిజైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ మరియు ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాల తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నారు.
Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసీఆర్

