భయపెట్టే ఈ కళ్లు..!

156
NTR Jai movie
NTR Jai movie

జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రినయం చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

Junior-NTR-New-Look

తాజాగా ఎన్టీఆర్ 27వ చిత్రంలో యంగ్ టైగర్ విలన్ పాత్ర చేయనున్నాడని టాక్. భయపెట్టే కళ్లతో.. గుండు చేసిన లుక్ తో ‘జై’ అనే కేరక్టర్లో కనిపించనున్నాడట ఎన్టీఆర్. ఇప్పుడు ఆ పాత్రకి సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఎన్టీఆర్ పాత్ర కోసం ఓ స్పెషల్ మాస్క్ ని తయారు చేయగా, అది ధరించిన ఎన్టీఆర్ ఇలా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న జై లవకుశ సినిమాతో ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.